Saturday 3 August 2019

अनूक्तम्-३० यावती सिकता, तावत् स्वर्णं


अनूक्तम्-३० यावती सिकता, तावत् स्वर्णं

            कस्यचन सिद्धस्य निकटे केचन शिष्याः अध्ययनायागताः। स बह्वीः सिद्धीः जानाति स्म। ताः शिक्षितुं एते आशान्विताः। स सिद्धः तान् एकं नियमं न्यस्तवान्- अहं यद् यथा वदामि, भवन्तः तत् तथैवाचरन्तु। तदानीमेव कीदृश्यपि शक्तिः हस्तगता भविष्यति।शिष्याः बाढमिति अङ्गीचक्रुः।
            तेभ्यः प्रथमाभ्यासः दत्तः। कस्स अभ्यासः? ‘अञ्जलौ यावती सिकता बध्यते, तावती स्वीकर्तव्या। एकक्रोशं यावत् चलनेन गत्वा किञ्चन स्थानं प्राप्तव्यम्।इति। सर्वे अङ्गीकृतवन्तः। सिकतां स्वीकृत्य निर्गताः।
            एकस्तु सिद्धः यथोक्तवान् तथैव श्रद्धया हस्तद्वयोः परिपूर्य सिकतां भृत्वा क्रोशं यावत् काञ्चिदपि अधः न पातयित्वा अगच्छत्। अपरः, ‘इयन्तीं सिकतां कः सहिष्यते?’ इति अल्पप्रमाणे सिकतां प्रसृतौ धृत्वा अयात्। अन्यः, ‘यत्किमपि स्वीकृत्य यत्र क्वचिदपि गच्छेत्, किं प्राप्येत?’ इति केवलं कालक्षेपाय क्रोशं यावत् अन्यैः सह अव्रजत्। इतरः प्रारम्भे तु श्रद्धयैव किञ्चित् दूरं गतवान्। किन्तु पश्चात् तस्य हस्तयोः पीडा जातेति अधिकं कालं तां धर्तुम् अशक्तः सन् वालुकां स्खलयन् अचलत्। सर्वे क्रोशं दूरं चलन्तः तत् स्थानं प्रापुः, यत् गुरुणोक्तम्।
            यदा ते तत्र प्राप्ताः तेषां हस्तेषु स्थिता वालुका स्वर्णत्वेन परिवर्तिता। सर्वे आश्चर्यचिकिताः। यावती सिकता, तावत् स्वर्णं तैः प्राप्तम्। यः अल्पप्रमाणे वालुकां स्व्यकरोत्, यः च नितरां न नीतवान्, मध्ये मार्गे असहित्वा सिकतां स्रंसितवान् ते अत्यन्तं परिदेवनामनुभूतवन्तः। सिद्धेनोक्तं गौरवभावेन, विश्वासेन, अक्षरशः च यः अनुष्ठितवान् स तु सर्वेभ्यः अधिकं लाभम् अवाप।
            नीतिः- गुरुणोक्तं कार्यं श्रद्धया क्रियते चेत् फलं प्राप्यते।
 ----------------------
          ఒక సిద్ధుడి వద్ద కొందరు శిష్యులు చేరారు. అతడికి ఎన్నో విద్యలు తెలుసు. అవి నేర్చుకుందాము అని వీరి ఆశ. ఆ సిద్ధుడు వారికి ఒక షరతు పెట్టాడు- నేను ఏది ఎట్లా చెప్తే మీరు అట్లాగే ఆచరించాలి. అప్పుడే ఏ శక్తి అయినా చేతికి వస్తుంది.శిష్యులంతా సరే అన్నారు.
          వారికి మొదటి అభ్యాసం ఇవ్వబడింది. అదేంటి అంటే దోసిట్లో పట్టినంత ఇసుక తీసుకోవాలి. ఒక కోసు దూరం నడుస్తూ వెళ్ళి ఒక చోటుకు చేరాలి.అందరూ సరేనన్నారు. ఇసుక తీసుకుని బయలుదేరారు.
          ఒకడు సిద్ధుడు చెప్పినట్టే శ్రద్ధతో రెండు చేతులు కలిపి నిండుగా ఇసుక తీసుకొని కోసెడు దూరం ఒక రవ్వ కూడా కింద పడకుండా వెళ్ళాడు. ఇంకొకడు, ‘ఇంత ఎవరు మోస్తారులేఅని పిడికిట్లో కొద్దిగా పట్టుకుని వెళ్లాడు. ఇంకొకడు, ‘ఏం పెట్టుకుని ఎంత నడిస్తే మాత్రం వచ్చేది ఏంటి?’ అని ఏదో కాలక్షేపం కోసం మిగతా వారితో కలిసి వెళ్ళాడు. మరొకడు మొదట శ్రద్ధగానే కొంత దూరం వెళ్ళాడు. కానీ చేతులు నొప్పి పుట్టి ఎక్కువసేపు పట్టుకోలేక ఇసుక జారవిడుస్తూ వెళ్ళాడు. అందరూ కోసెడు దూరం నడుస్తూ వెళ్ళి గురువు చెప్పిన చోటికి చేరారు.
          చేరిన వెంటనే వాళ్ళ చేతుల్లో ఉన్న ఇసుక బంగారంగా మారింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత ఇసక ఉంటే అంత బంగారం వారికి దక్కింది. కొద్దిగానే తీసుకుపోయిన వాడు, అసలు తీసుకుపోనివాడు, ఇసక జారవిడుచుకున్నవాడు చాలా బాధపడ్డారు. సిద్ధుడు చెప్పిన మాటను గౌరవించి, నమ్మి, సరిగ్గా ఆచరించినవాడికి మాత్రం అందరికన్నా ఎక్కువ లాభపడ్డాడు.
          నీతి- గురువు చెప్పిన పనిని శ్రద్ధగా చేస్తే తప్పక ఫలితం లభిస్తుంది.

No comments:

Post a Comment