Friday 2 August 2019

अनूक्तम्-२९ पाठः सम्यगवगतः

 अनूक्तम्-२९ पाठः सम्यगवगतः


            कस्मिंश्चित् गुरुकुले कतिपयबालाः कस्माच्चित् गुरोः पठन्ति स्म। एकस्मिन् दिने पाठे गुरुः तान् कञ्चित् महोन्नतं विषयमुक्तवान्। सर्वे एनं पाठं पठन्तुइत्यपि प्रोवाच। परमात्मा सर्वत्र अस्ति। सर्वान् पश्यति। अस्माभिः यत् क्रियते तद् अशेषं परिशीलयतिइति स पाठः। बालाः सर्वे तं पाठं सम्यक् गुरम् अनु उक्तवन्तः।
            पाठः सम्पन्नः। ततः गुरुपत्नी तेभ्यः लड्डुकान् आनीय एकस्मै बालाय एकैकं लड्डुकं प्रादात्। गुरुः सर्वान् उक्तवान्, ‘तान् लड्डुकान् गृह्णन्तुइति। ते खादितुं यदा उद्युक्ताः तदानीं कञ्चित् नियममवादीत्- एतान् लड्डुकान् सर्वे अत्तुं शक्नुवन्ति। किन्तु खादनसमये कोऽपि न पश्येत्!इति।
            बालाः सर्वे अङ्गीकृतवन्तः। ते सम्यक् विचार्य, ‘यत्र कोऽपि न पश्येत् तादृशानि स्थानानि कानि कानि स्युः?’ इति अन्विष्य अन्विष्य लड्डुकान् खादित्वा प्रत्यागच्छन्। अयि भोः बालाः, किं सर्वे लड्डुकान् अखादथ?” इति प्रश्ने कृते आम्, अखादाम।इति सोत्साहमुक्तवन्तः। क्व क्व अभक्षयथ?” इति पृष्टे, ‘कश्चित् मञ्चस्य अधः, अन्यः वृक्षस्य पृष्ठे, अपरः द्वारस्य परोक्षे निलीय, इतरः बृहन्मञ्जूषायाः पार्श्वे, कश्चन गृहच्छदं गत्वा, अन्यतरः कम्बलम् आच्छाद्य च- एवं भुक्तवन्तः’- इति अब्रुवन्। तेषां बुद्धिकौशलं दृष्ट्वा गुरुः अहसत्।
            तेष्वेकः तु सखेदं हस्ते लड्डुकां गृहीत्वा अतिष्टत्। तमपृच्छत् गुरुः- त्वं लड्डुकां कुतो न अखादः?” इति। तथा पृष्टे स अवोचत्- यत्र कुत्रापि अगच्छं, तादृशं स्थानं न लब्धवान्, यत्र कोऽपि न पश्यति, आर्य।इति। तर्हि एते सर्वे अखादन् किल?” इत्युक्ते, “परमात्मा सर्वत्र पश्यतीति भवानेव किलोवाच। देवः यदा पश्यति, तदा कोऽपि न पश्यतीति अहं कथं खादानि?” इति स अपृच्छत्। तदा गुरुः करतालं कृत्वा अभणत्- “‘देवः सर्वत्र स्थित्वा सर्वान् पश्यतीति पाठः अनेनेकैनेव सम्पूर्णतया अवगतः..इति सर्वेषां मध्ये तं प्राशंसत्॥
            नीतिःये शब्दा श्रूयन्ते तेषाम् अन्तरार्थं ज्ञात्वा आचरणं कर्तव्यम्॥

--उषाराणी सङ्का
 ----------------------
          ఒక గురుకులంలో కొందరు పిల్లలు ఒక గురువుగారి దగ్గర చదువుకుంటూ ఉండేవారు. ఒకరోజు పాఠంలో గురువుగారు వారికి ఒక మహోన్నతమైన విషయం చెప్పాడు. దానిని అందరూ నేర్చుకోవాలి.అని కూడా చెప్పాడు. దేవుడు అంతటా ఉన్నాడు. అందరినీ చూస్తున్నాడు. మనం చేసేది గమనిస్తున్నాడు.అని ఆ పాఠం. పిల్లలంతా చక్కగా ఆ పాఠాన్ని తిరిగి అప్పచెప్పారు.
          పాఠం పూర్తయిన తర్వాత గురుపత్ని వారికోసం లడ్డూలను తెచ్చి తలా ఒకటీ ఇచ్చింది. గురువుగారు అందరినీ ఆ లడ్డూలు తీసుకోమని చెప్పారు. తినబోతుంటే ఒక షరతు పెట్టారు. ఈ లడ్డూలను అందరూ తినవచ్చు. కానీ ఎవరూ చూడకుండా తినాలి సుమా!అని.
          పిల్లలంతా సరేనన్నారు. వాళ్ళు బాగా ఆలోచించి, ‘ఎవరూ చూడని చోట్లు ఏవేవి ఉంటాయి?’ అని వెతికి మరీ లడ్డూలు తిని వచ్చేసారు. ఏమర్రా, అందరూ లడ్డూలు తిన్నారా?” అని అడిగితే తిన్నామండీఅని చెప్పారు ఉత్సాహంగా. ఎక్కడెక్కడ తిన్నారు?” అంటే, ఒకడు మంచం కింద, ఒక చెట్టు వెనకాల, ఒకడు తలుపు చాటున, ఒకడు బోషాణం పక్కన, మరొకడు డాబా మీద, ఇంకొకడు దుప్పటి కప్పుకొని- ఇట్లా తినేసాము- అని చెప్పారు. వాళ్ళ తెలివికి గురువు నవ్వాడు.
          ఒకడు మాత్రం దిగులుగా చేతిలో లడ్డూతో నిలబడి పోయాడు. అతడిని, “నువ్వు లడ్డూ ఎందుకు తినలేదు?” అని అడిగితే- ఎక్కడికి వెళ్ళినా ఎవరూ చూడని చోటు నాకు కనపడలేదండీ.అన్నాడు. మరి వీరంతా తిన్నారు కదా?” అంటే, “దేవుడు చూస్తుంటాడు- అని మీరే కదా చెప్పారు. దేవుడు చూస్తున్నప్పుడు ఎవరూ చూడటం లేదని ఎట్లా తినమంటారు?” అని అడిగాడు. అప్పుడు గురువు చప్పట్లు చరిచి దేవుడు అంతటా ఉండి అందరినీ చూస్తున్నాడనే పాఠం పూర్తిగా అర్థమైంది వీడొక్కడికే..అని అందరిలో మెచ్చుకున్నారు.
          నీతివిన్న మాటలను అంతరార్థం తెలుసుకుని ఆచరణలో పెట్టాలి.

No comments:

Post a Comment